మిల్కీ బ్యూటీ తమన్నా రూటే సపరేటు. మోహన్ బాబు తనయుడు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా… నిజానికి ఇంతకాలం స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందని ఆ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు. పాలబుగ్గల ఈ చిన్నారి… వచ్చినంత వేగంగా వెళ్ళిపోతుందనే అనుకున్నారు. కానీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే తమన్నా… నిదానంగా తన నట జీవితాన్ని పద్ధతి ప్రకారం విస్తరింపచేస్తూ, అంకిత భావంతో అనుకున్నది సాధిస్తూ ముందుకు కదిలింది. తమన్నాలో…