సౌత్‌లో ‘మిల్కీ బ్యూటీ’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా టాలీవుడ్‌లో అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2005లో ‘శ్రీ’ సినిమాతో హీరోయిన్‌గా ఎంటర్ అయిన ఆమె, తెలుగుతో పాటు తమిళం, హిందీ, వెబ్ సిరీస్‌లు ఇలా అన్ని భాషల్లోనూ తనకంటూ భారీ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. లవ్ స్టోరీస్ నుంచి యాక్షన్ ఎంటర్టైనర్ లు, లేడీ ఓరియెంటెడ్ రోల్స్ నుంచి కమర్షియల్ మూవీస్ వరకు అనేక రకాల పాత్రలతో తన నటనలో కొత్తదనం చూపించింది తమన్నా.…
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా ఇంకా గ్లామర్, యాక్టింగ్, డ్యాన్స్ విషయంలో యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఫిట్‌గా కొనసాగుతోంది. గతంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ, ఇప్పుడు స్పెషల్ సాంగ్స్, వెబ్ ప్రాజెక్ట్స్‌తో మళ్లీ తనకంటూ కొత్త దారులు తెరుస్తోంది. అయితే ఒక్కప్పుడు వయసు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గుతాయి అని మనకు తెలిసిందే. కానీ ప్రజంట్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి.…