మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా ఇంకా గ్లామర్, యాక్టింగ్, డ్యాన్స్ విషయంలో యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఫిట్‌గా కొనసాగుతోంది. గతంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ, ఇప్పుడు స్పెషల్ సాంగ్స్, వెబ్ ప్రాజెక్ట్స్‌తో మళ్లీ తనకంటూ కొత్త దారులు తెరుస్తోంది. అయితే ఒక్కప్పుడు వయసు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గుతాయి అని మనకు తెలిసిందే. కానీ ప్రజంట్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం 35 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటికీ ఇప్పటికి యంగ్ హీరోయిన్‌లకు గట్టి పోటి ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడిన తమన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Also Read : Dacoit- toxic : యష్‌తో ఢీకి సిద్ధమైన అడివి శేష్ – ‘డెకాయిట్’, ‘టాక్సిక్’ క్లాష్ ఫిక్స్!
తమన్న మాట్లాడుతూ.. “30 ఏళ్లు దాటిన హీరోయిన్ ని చూసే విధానం ఇప్పుడు పూర్తిగా మారింది. ఒకప్పుడు హీరోయిన్ 30 దాటితే కథ ముగిసిందని అనుకునే రోజులు పోయాయి, ఇప్పుడు వయస్సుతో పాటు అనుభవం ఉన్న నటీమణులకు మంచి, బలమైన క్యారెక్టర్లు వస్తున్నాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు 10 ఏళ్ల ప్లాన్ పెట్టుకున్నా. 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలని అనుకున్నా. కానీ ఆ టైమ్‌లో నేనే నిజంగా ఎవరో, నా వ్యక్తిత్వం ఏమిటో అర్థం చేసుకున్నా. అదృష్టవశాత్తూ, అప్పటి నుంచి ఇండస్ట్రీ మహిళల కోసం శక్తివంతమైన పాత్రలు రాయడం మొదలు పెట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మార్పు. ఎందుకో వృద్ధాప్యాన్ని వ్యాధిలా మాట్లాడతారు. కానీ వృద్ధాప్యం చాలా అద్భుతమైనది. అది మన అనుభవాల ప్రతిబింబం. ఇప్పుడు ఈ వయసులో నేను చేస్తున్న పాత్రలు నాకు మరింత బలం ఇస్తున్నాయి” అంటూ తమన్నా చెప్పింది.
ప్రస్తుతం ఆమె విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’లో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం 2025 చివర్లో లేదా 2026 ఆరంభంలో విడుదల కానుంది. అలాగే ‘వవన్ – ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే పౌరాణిక థ్రిల్లర్‌లో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా 2026 మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది.