Afghanistan: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన అశాంతి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాల్లో నిలిచింది. పాకిస్థాన్ వైమానిక దాడులకు ప్రతిస్పందనగా, ఆఫ్ఘనిస్థాన్ పాక్ దళాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. తాజాగా రెండు దేశాలు ఇప్పటికీ దీర్ఘకాలిక కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తాలిబన్లు లష్కరే తోయిబా శిబిరంలో పెరిగిన ఓ చొరబాటుదారుడిని అరెస్టు చేశారు.
Afghanistan: భారతదేశం బాటలో ఆఫ్ఘనిస్థాన్ నడుస్తుంది. తాజాగా తాలిబన్ల దెబ్బతో పాకిస్థాన్‌లో నీటి కటకట ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఇండియా అనుసరించింది ఏంటో తెలుసా.. భారత్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశానికి నీటి సరఫరాను రద్దు చేసింది. ఇప్పుడు ఇదే బాటలో తాలిబన్ ప్రభుత్వం కూడా వేగంగా అడుగులు వేస్తుంది. తాలిబాన్ డిప్యూటీ సమాచార మంత్రి ముజాహిద్ ఫరాహి ఇటీవల మాట్లాడుతూ.. కునార్ నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని తాలిబాన్ సుప్రీం…
Pak- Afghan war: ఆఫ్ఘన్ భూభాగంలో పాకిస్థాన్ వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ ప్రతీకార దాడుల్లో కనీసం 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని, 30 మంది గాయపడ్డారని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇటీవల పాకిస్థాన్ తమ దేశ రాజధాని కాబుల్‌తోపాటు ఓ మార్కెట్‌పై బాంబు దాడులు చేసిందని ఇందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు తెలిపారు.