తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు వస్తున్నాయన్న విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తుందని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి రొయ్యల పంపిణీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా కొండ భీమనపల్లి చెరువులో విడుదల…
తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ ను రాబోయే 3 సంవత్సరాలలో 1500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించే విధంగా సమగ్ర కార్యాచరణ ను రూపొందించాలని రాష్ట్ర పశు సంవ ర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్, నూతన ఔట్ లెట్ ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాల…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బండి సంజయ్ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గొర్రెల పంపిణీకి కేంద్రం వెయ్యి కోట్లు ఇస్తామని ఎగొట్టిందని ఆయన అన్నారు.ఆ వెయ్యి కోట్లు కూడా తెలంగాణ అప్పు తీసుకుని గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. బండి సంజయ్ చెప్పినట్టు కేంద్రం వెయ్యి కోట్లు సబ్సిడీ ఇవ్వ…
తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ హయాంలో జరిగినన్ని అభివృద్ధి పనులు గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్‌లో మత్స్యకారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. హుజురాబాద్ ప్రజలు గతంలో ఈటెలకు ఓట్లు ఎందుకు వేశారో చెప్పాలని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా ఆయన ఏం చేశారని నిలదీశారు. గత రెండున్నర ఏళ్లలో బండి సంజయ్ తన పార్లమెంట్…
‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “మా’కు ఎన్నికయిన సభ్యులకు నా అభినందనలు. ఇది ఎంతో సంతోషదాయకమై సందర్భం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో ‘మా’ ఎన్నికలు జరిగాయి. ‘మా’ అసోషియేషన్ అంటే చిన్న అసోసియేషన్ కాదు. ‘మా’ అంటే పెద్ద…
ఉత్కంఠభరితంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు కూడా వచ్చేశాయి.. అయితే, రాజీనామాలు, కోర్టుకు వెళ్తామనే ప్రకటనలు ఎలా ఉన్నా… ‘మా’ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతోంది… రేపు ఉదయం 11 గంటలకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా…
‘మా’ ఎన్నికల అధికారిగా గెలిచిన మంచు విష్ణు ఇప్పటికే పదవీ బాధ్యతలను చేపట్టారు. ‘మా’ అధ్యక్షుడిగా ఆయన మొదటి సంతకం ఆగిపోయిన పెన్షన్స్ ఫైల్ పై చేశారు. ఇక తనను గెలిపించిన వారికి మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపిన విష్ణు ఇప్పుడు స్వయంగా అందరీ ఇంటికి వెళ్లి కలుస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, కోట శ్రీనివాస రావు, పరుచూరి బ్రదర్స్ వంటి వారిని కలిసిన మంచు విష్ణు త్వరలోనే చిరంజీవిని కూడా కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటానని వెల్లడించారు. ఈరోజు…
కంటోన్మెంట్ జిహెచ్ఎంసిలో విలీనం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాజాగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సిల్వర్ కాంపౌండ్ లో 17 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ… కంటోన్మెంట్ కు ఎలాంటి నిధుల కేటాయింపు లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదు. జిహెచ్ఎంసిలో విలీనం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని…
సమైక్య రాష్ట్రంలో కులవృత్తుల నిరాదరణ తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ధ్వoసం అయ్యింది అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. మత్సకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతుంది. కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేoదుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం…