Supreme Acceptance of Trial on Talaq-e-Hasan Divorce: ఏకపక్ష చట్టవిరుద్ధమైన విడాకులు, తలాక్-ఎ-హసన్ వంటి విడాకులు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. తలాక్-ఎ-హసన్ అనేది ఇస్లాంలో విడాకులకు ఓ రూపం. దీని ద్వారా పెళ్లయిన పురుషుడు తన భార్యకు ప్రతీ నెల ‘తలాక్’ పదాన్ని చెప్పడం ద్వారా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు.