అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీప్‌ఫేక్, రివెంజ్ పోర్న్‌లపై ఉక్కుపాదం మోపారు. వీటి కట్టడికి చట్టం చేశారు. ట్రంప్ బిల్లుపై సంతకం చేశారు. ఈ చట్టం పేరు టేక్ ఇట్ డౌన్ యాక్ట్. ఈ చట్టం అమల్లోకి వస్తే ఎవరైన వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి అనుమతి లేకుండా AI జనరేటెడ్ అశ్లీల చిత్రాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తే, అప్పుడు టెక్నాలజీ కంపెనీలు 48 గంటల్లోపు ఆ కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది. మన పిల్లలు, మన కుటుంబాలు,…