Rohit Sharma Mother Purnima Sharma Speech in Wankhede: టీమిండియా స్టార్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన అనంతరం హిట్‌మ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్ తరఫున రోహిత్ చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్ట్, వన్డేలలో మాత్రం హిట్‌మ్యాన్ కొనసాగనున్నాడు. అయితే టీ20 రిటైర్మెంట్ గురించి రోహిత్ ముందుగా తన తల్లికి…
Mohammed Siraj Road Show in Hyderabad Today: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన భారత జట్టు.. కాస్త ఆలస్యంగా గురువారం (జులై 4) స్వదేశానికి చేరుకుంది. 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి.. స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టుకు ఢిల్లీ నుంచి ముంబై వరకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన అనంతరం ముంబైకి వచ్చిన టీమిండియా.. ‘వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్…
Virat Kohli Wankhede Speech: 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన రోజు కంటతడి పెట్టిన సీనియర్ల భావోద్వేగాలతో తాను కనెక్ట్ కాలేకపోయానని, ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. చాలా కాలంగా టీ20 ప్రపంచకప్ కోసం ప్రయత్నిస్తున్నామన్నాడు. ఇంత మంది అభిమానులను చూస్తుంటే.. తనకు చాలా సంతోషంగా ఉందని విరాట్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టు.. గురువారం స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే.…
Hardik Pandya, Natasa Stankovic Divorce News: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ విడిపోతున్నాడంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం లేకపోలేదు.. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేశారు. కేవలం కుమారుడితో ఉన్న ఫొటోలను మాత్రమే ఇన్‌స్టాలో ఉంచడంతో.. విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. ఇక టీ20 ప్రపంచకప్ 2024 భారత్ గెలవడంతో కీలక…
A Fan Climb A Tree For Looking Indian Cricket Team Victory Parade: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి గురువారం స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియా క్రికెటర్లకు బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్.. పొట్టి ప్రపంచకప్‌ను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో జనాలతో ముంబై రోడ్లు కిక్కిరిసిపోయాయి. ముంబైలోని మెరైన్ రోడ్డు అయితే కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన రోడ్‌షో.. భారత…
ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న భారత ఆటగాళ్లకు ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఢిల్లీ నుంచి ముంబైకి భారత ఆటగాళ్లు వచ్చే విమానానికి విస్తార ఎయిర్లైన్స్ UK 1845 నెంబర్ ను కేటాయించింది.
బార్బడోస్ గడ్డపై 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత క్రికెట్ జట్టు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఈరోజు భారత జట్టు తిరిగి స్వదేశానికి చేరుకుంది. ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని టీమిండియా సభ్యులు కలిశారు.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు ఉదయం భారత క్రికెటర్లు స్వదేశానికి వచ్చారు. అనంతరం.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో ప్రధాని ఫొటోలు దిగారు. ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ…
Team India Players Photo With PM Modi: టీ20 ప్రపంచకప్ 2024తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లు.. గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో ప్రధాని ఫొటోలు దిగారు. ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ సెక్రటరీ…
Team India Players in Special Jersey: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన భారత జట్టు నేడు స్వదేశానికి చేరింది. బార్బడోస్ నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భారత క్రికెట్ జట్టు గురువారం ఉదయం దేశరాజధాని ఢిల్లీ చేరుకుంది. విశ్వవిజేతగా నిలిచి స్వదేశానికి చేరుకున్న రోహిత్ సేనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లిన భారత జట్టు.. అక్కడ కాసేపు సేద తీరింది.…