Hardik-Natasa Divorce: హార్దిక్, నటాషా విడాకులు పక్కా.. కారణం ఇదేనా?
- హార్దిక్‌తో కలిసి ఉన్న ఫొటోలు డిలీట్
- ఒక్క పోస్టు కూడా పెట్టలేదు
- ఎవరూ తోడుగా లేరని బాధపడనవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya, Natasa Stankovic Divorce News: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ విడిపోతున్నాడంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం లేకపోలేదు.. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేశారు. కేవలం కుమారుడితో ఉన్న ఫొటోలను మాత్రమే ఇన్‌స్టాలో ఉంచడంతో.. విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. ఇక టీ20 ప్రపంచకప్ 2024 భారత్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన హార్దిక్‌ను నటాషా కనీసం విష్ చేయకపోవడం గమనార్హం.
టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లలో 20 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్స్ పడగొట్టాడు. టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండర్‌గా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దాంతో హార్దిక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే హార్దిక్ ప్రదర్శనపై నటాషా స్టాంకోవిచ్ ఇప్పటివరకు స్పందించలేదు. హార్దిక్‌కు సంబంధించిన ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. దీంతో హార్దిక్, నటాషాలు త్వరలో విడాకులు తీసుకుంటారని వస్తున్న వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయింది. రోహిత్ సతీమణి రితిక, విరాట్ భార్య అనుష్కలు తమ భర్తల ఆటపై సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Viral Video: భారత జట్టును దగ్గరగా చూడ్డానికి.. ఏకంగా చెట్టెక్కిన అభిమాని!
ఇక నటాషా స్టాంకోవిచ్ తాజాగా పెట్టిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం. ఎంతో నిరుత్సాహపడతాం. చాలా బాధను అనుభవిస్తాం. అలాంటి సమయంలో ఎవరూ తోడుగా లేరని బాధపడనవసరం లేదు. అన్నింటికీ ఆ దేవుడు ఉన్నాడు. మనకు ఏం కావాలో ఆయనకు తెలుసు. భగవంతుడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది’ అంటూ నటాషా ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ పోస్ట్ హార్దిక్ పాండ్యా గురించే పెట్టారని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!