Super Over: టీ20 ప్రపంచకప్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్‌లో నమీబియా విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Namibia Win in Super Over Against Oman: టీ20 ప్రపంచకప్ 2024లో తొలి సూపర్ ఓవర్ నమోదైంది. బార్బడోస్ వేదికగా ఒమన్, నమీబియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌లో తేలింది. సూపర్ ఓవర్‌లో ఒమన్‌పై నమీబియా అద్భుత విజయం సాధించింది. విజయం కోసం ఇరు జట్లు పోరాడంతో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగులు చేయగా.. ఒమన్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఓడింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ చెలరేగడంతో ఒమన్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కశ్యప్ (0), నసీమ్ ఖుషీ (6), అకిబ్ ఇలియాస్ (0) పెవిలియన్ చేరారు. ఈ సమయంలో జీషన్ మక్సూద్ (20; 20 బంతుల్లో 4 ఫోర్స్), ఖలీద్ కైల్ (34; 39 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) జట్టును ఆదుకున్నారు. అయాన్ ఖాన్ (15) రాణించారు. రూబెన్ 4 వికెట్స్ తీయగా.. డేవిస్ వైస్ 3, గెర్హార్డ్ ఎరాస్మస్ 2 వికెట్స్ తీశారు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అనంతరం ఛేదనలో నమీబియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మైఖేల్ వాన్ లింగేన్ డకౌట్ అయ్యాడు. నికోలాస్ డేవిన్ (24), జేన్ ఫ్రైలింక్ (45; 48 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. ఒమన్ బౌలర్ మెహ్రన్ ఖాన్ (3/7) మూడు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దాంతో 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. నమీబియా ఒక్క పరుగే చేసింది.
Also Read: Preity Zinta: నా కెరీర్‌లో కఠినమైన సినిమా ఇదే: ప్రీతీ జింటా
మ్యాచ్‌లో తేలిపోయిన నమీబియా.. సూపర్ ఓవర్‌లో మాత్రం చెలరేగింది. ఓ సిక్స్, 3 బౌండరీలతో 21 పరుగులు సాధించింది. డేవిడ్ వైస్ ఫోర్, సిక్స్ బాధగా.. ఎరాస్మస్ రెండు ఫోర్లు కొట్టాడు. బిలాల్ ఖాన్ 21 రన్స్ ఇచ్చాడు. సూపర్ ఓవర్ ఛేదనలో ఒమన్ ఓ వికెట్ కోల్పోయి 10 పరుగులే చేసింది. డేవిడ్ వైస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. డేవిడ్ వైస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!