Home
T20 Cricket
T20 Cricket News
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
భారత్, ఐర్లాండ్ మధ్య జరగబోయే రెండు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌కు టీమిండియా సర్వసిద్ధమైంది. ఈ సిరీస్ ద్వారా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మొదటిసారి భారత టీ-20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. ఇరు జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ జూన్ 26న, రెండో మ్యాచ్ జూన్ 28న సాయంత్రం వేళల్లో జరగనున్నాయి. భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య జరగబోయే నాలుగో ద్వైపాక్షిక టీ-20 సిరీస్ ఇది. విశేషం ఏంటంటే.. ఐర్లాండ్‌తో జరిగిన ప్రతి టీ-20 సిరీస్‌లోనూ… -
Faf du Plessis: 41 ఏళ్ల వయసులోనూ డు ప్లెసిస్ విధ్వంసం.. ప్రపచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్..
Faf du Plessis: క్రికెట్ చరిత్రలో సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ వయసులో సెంచరీ సాధించిన ఆటగాడిగా ఆయన చరిత్ర పుటల్లోకెక్కాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఈ వెటరన్ స్టార్.. సియాటెల్ ఓర్కాస్‌పై మెరుపు శతకంతో చెలరేగాడు. చెన్నై సూపర్ కింగ్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్… -
ICC Women’s T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
ICC Women's T20 World Cup: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గ్రూప్-ఎ మ్యాచ్ కేవలం ఆట పరంగానే కాకుండా, ఐసీసీ విధించిన జరిమానాతోనూ వార్తల్లో నిలిచింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియాపై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గానూ పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయం ముగిసేసరికి పాక్ జట్టు ఒక ఓవర్ వెనుకబడి ఉండటంతో, ఆటగాళ్ల మ్యాచ్… -
APL 2026లో భోణీ కొట్టిన విజయవాడ సన్‌షైనర్స్.. కాకినాడ పై సూపర్ విక్టరీ
APL 2026: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ 2026 సీజన్-5లో నాలుగో రోజు తొలి మ్యాచ్‌లో విజయవాడ సన్ షైనర్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కాకినాడ కింగ్స్‌పై సమిష్టి ప్రదర్శనతో 202 పరుగుల భారీ స్కోరును కాపాడుకుంటూ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన కాకినాడ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విజయవాడ సన్ షైనర్స్‌కు గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన అశ్విన్ తక్కువ పరుగులకే అవుట్… -
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో తెలుగు క్రికెట్ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్. సోషల్ మీడియాలో అభిమానులు ప్రేమగా పిలుచుకునే “కాటేరమ్మ కొడుకు” అయిన ట్రావిస్ హెడ్ స్థానంలో, ఇప్పుడు ఆస్ట్రేలియా జాతీయ టి20 జట్టులోకి భారత సంతతికి చెందిన నిఖిల్ చౌదరి ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరగబోయే టి20 సిరీస్ నుంచి హెడ్‌కు విశ్రాంతినివ్వడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నిఖిల్ చౌదరిని ఆస్ట్రేలియా సెలెక్టర్లు పిలిచారు.… -
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ ప్రస్థానం ఒక వెలుగు వెలిగి, అంతే వేగంగా ముగింపు దశకు చేరుకుంది. కెరీర్లో 113 టీ20లలో 3,272 పరుగులు చేసిన సూర్య.. 35 ఏళ్ల వయసులో ఇప్పుడు మళ్లీ భారత జట్టులోకి రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకప్పుడు తన అద్భుతమైన బ్యాటింగ్‌తో టీ20 స్వరూపాన్నే మార్చేసిన ఈ ‘మిస్టర్ 360’ ఆటతీరు ఎందుకు పతనమైందనేది ఆసక్తికరం. 2025లో 19 టీ20 ఇన్నింగ్స్‌లలో సూర్య కేవలం 218… -
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
భారత క్రికెట్లో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది, అదే.. వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు చేసి, 237.30 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించిన ఈ 15 ఏళ్ల యువ సంచలనానికి భారత సీనియర్ టీ20 జట్టులో తొలిసారి చోటు దక్కింది. జూన్ 26, జూన్ 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు, ఆ తర్వాత జూలైలో ఇంగ్లాండ్‌తో 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఈ పర్యటనల్లో గనుక… -
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్‌గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
Jasprit Bumrah: ధర్మశాలలోని హెచ్పీసీఏ (HPCA) స్టేడియంలో మే 14న జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌గా తన మొదటి మ్యాచ్‌లోనే జస్ప్రీత్ బుమ్రా జట్టును గెలిపించి ‘విన్నింగ్ స్టార్ట్’ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకోవడం ఆనందంగా ఉందని బుమ్రా చెప్పాడు. రెండు జట్లు… -
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
Virat Kohli: రాయ్‌పూర్ మైదానంలో వర్షం కారణంగా మ్యాచ్ 75 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, అక్కడి ప్రేక్షకుల నిరీక్షణకు తగిన ప్రతిఫలం దక్కింది. 'ఛేజ్ మాస్టర్' విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో మరో అద్భుతాన్ని ఆవిష్కరించి అందరినీ అలరించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన కోహ్లీ, ఈ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే పరుగు తీసి గట్టిగా గాలిలో పిడికిలి బిగించి తన ఆనందాన్ని చాటుకున్నాడు. అంతేకాదు 60… -
Abhishek Sharma: క్యాలెండర్ ఇయర్ లో.. 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ నయా హిస్టరీ
భారత ఓపెనింగ్ యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. క్యాలెండర్ ఇయర్ లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా అభిషేక్ శర్మ నయా హిస్టరీ సృష్టించాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్, సర్వీసెస్ మధ్య జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, 2025-26 మ్యాచ్‌లలో భారత స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా…
తాజావార్తలు
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
-
Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!