Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క గెలుపు… అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు భారత్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలవని రికార్డును తిరగరాస్తూ, ప్రపంచ ఛాంపియన్స్ అయిన టీమిండియాను మట్టికరిపించింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఐర్లాండ్ జట్టు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. గత 12 ప్రయత్నాల్లో అంటే 9 టీ20లు, 3 వన్డేలలో భారత్‌పై ఎప్పుడూ గెలవని ఐర్లాండ్.. చరిత్రలో మొదటిసారి టీమిండియాను ఓడించి సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌ను ఓడించిన 11వ జట్టుగా నిలవడమే కాకుండా, ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన 8వ పూర్తి స్థాయి సభ్యత్వ దేశంగా భారత్ నిలిచింది. ఇక ఐర్లాండ్ ఖాతాలో పడని దేశాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక మాత్రమే మిగిలాయి.
ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ అద్భుతమైన కంబ్యాక్ రికార్డును కూడా నమోదు చేసింది. భారత్‌పై టీ20ల్లో కేవలం 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన అత్యల్ప స్కోరు స్థితి నుండి కోలుకుని మ్యాచ్ గెలిచిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో 2016లో న్యూజిలాండ్ 61/4 స్కోరు నుండి కోలుకుని గెలవడమే ఇప్పటివరకు అత్యల్పంగా ఉండేది.
Also Read
ఇక ఐర్లాండ్ తరపున అరంగేట్రం చేసిన మాథ్యూ హాలార్డ్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే భారత్‌పై 3/28 అత్యుత్తమ గణాంకాలతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఐర్లాండ్ తరపున టీ20 అరంగేట్రంలో ఈ అవార్డు సాధించిన రెండో ఆటగాడిగా, ఓవరాల్‌గా అంతర్జాతీయ అరంగేట్రంలో ఈ ఘనత సాధించిన మూడో ఐర్లాండ్ ప్లేయర్‌గా హాలార్డ్ నిలిచాడు. అంతేకాదు, భారత్‌పై టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన ఐర్లాండ్ బౌలర్లలో పీటర్ చేస్ (4/35) తర్వాత హాలార్డ్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు.
ఒక్క విన్ తో మొత్తం ఛేంజ్ అయిపోయింది. లోర్కాన్ టక్కర్ కెప్టెన్సీలో గాయాలతో సతమతమవుతున్న ఐర్లాండ్ జట్టు, ఏకంగా ప్రపంచ ఛాంపియన్స్ విజయ పరంపరకు బ్రేక్ వేసింది. గత 12 సిరీస్‌లుగా ఓటమి ఎరుగని టీమిండియా ఆధిపత్యానికి గట్టి అడ్డుకట్ట వేస్తూ ఐర్లాండ్ సాధించిన ఈ విజయం క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తింది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!