(సెప్టెంబర్ 17న టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు)కాసింత కళాపిపాస ఉంటే చాలు మనసు పులకించే క్షణాలను మనమే వెదుక్కోవచ్చు అంటారు పెద్దలు. ప్రముఖ నిర్మాత, రాజకీయ నేత తిక్కవరపు సుబ్బరామిరెడ్డిలో కాసింత కాదు ఆయన మోసేంత కళాపిపాస ఉంది. అందువల్లే కళలను ఆరాధిస్తూ కళాకారులను గౌరవిస్తూ ‘కళాబంధు’గా జనం మదిలో నిలచిపోయారు సుబ్బరామిరెడ్డి. రాజకీయరంగంలో రాణించిన సుబ్బరామిరెడ్డి చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికిస్తూ సాగారు. జయాపజయాలకు అతీతంగా సుబ్బరామిరెడ్డి చిత్రప్రయాణం సాగింది. తెలుగువారయినా హిందీలోనూ చలనచిత్రాలు నిర్మించారు. నిజం చెప్పాలంటే…