హైదరాబాద్ నేడు టి.కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే రెండో రోజు పర్యట కొనసాగుతుంది. ఇవాళ టి.కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తో భేటీ కానున్నారు. తర్వాత డీసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్స్ తో థాక్రే సమావేశం కానున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో పంచాయతీపై అధిష్ఠానం సీరియస్‌గానే నజర్ పెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను పరిశీలకుడిగా పంపిస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్‌కు రాబోతున్నారు. అధిష్ఠానం జోక్యంతో సీనియర్ నేతల సమావేశం వాయిదా పడింది.
దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రశ్నిస్తే కేసులు, వాళ్ళు చెప్పితే మాట్లాడాలి, ప్రచారం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. భారత్ రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు దీనిని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.
కరీంనగర్ జిల్లాలోని పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు చేశారు. 16వ డివిజన్ లో 44 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
jana reddy comments: కాంగ్రెస్ నేత జానా రెడ్డి మునుగోడులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు నేను ఎంతో శ్రమ పడ్డా, నన్ను ఇంకా ఆయాస పెట్టకండని, మీరు అలిసి మీ కాడి కింద పడేసినప్పుడు నేను వస్తా అన్నారు. నేను రాలేదని అనుకోకండని అన్నారు. నన్ను ఎక్కువ ఆయాస పెట్టకండని తెలిపారు. మునుగోడులో ముఖ్య కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి జిల్లాకు సాగునీరు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని వ్యాఖ్యానించారు.…
Take money from whoever gives but.. vote only Congress: బీజేపీ మత కొల్లోలాలు సృష్టిస్తుంది! తిప్పి కొట్టాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలపై ఉందని నల్లగొండ ఎంపీ, మాజీ పీసీసీ చీఫ్, ఉత్తంకుమార్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా మునుగోడులో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ విడుదల చేశామన్నారు. టీఆర్‌ఎస్ రైతు వ్యతిరేక విధానాలతో రైతు ఆత్మహత్యలు తెలంగాణలో పెరిగిపోయాయని అన్నారు. ధనిక రాష్ట్రంలో…
V. Hanumantha Rao Comments on congress party, gulam nabi azad: ఏఐసీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని.. భారతదేశంలో ఈ ఎన్నికల గురించి ఆలోచన మొదలైందని అన్నారు కాంగ్రెస్ సీనియర నేత వీ హన్మంతరావు. కొందరు గాంధీ కుటుంబం కాకుండా బయటి వారిని పెట్టాలని అంటున్నారని..మిగతా వారిని పెడితే కాంగ్రెస్ నాయకత్వం గ్రామగ్రామానికి వెళ్లడం కష్టం అని అన్నారు. రాహుల్ గాంధీ ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదని..ప్రియాం
ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ, వీరంతా ప్రత్యక్ష.. పరోక్ష మిత్రులే అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సంచళనవాఖ్యలు చేశారు. రాజాసింగ్ లాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మతంతో బీజేపీ ఏలాలని అనుకుంటుందని మండిపడ్డారు. హిందుత్వాన్ని బీజేపీకి కట్టబెట్టలేదని విమర్శించారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగోట్టేందుకు బీజేపీ ప్రయతన్నిస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెంగాణలో కాంగ్రేస్ గెలిచే అవకాశం ఉందదనే ఉద్దేశ్యంతో.. బీజేపీ, టీఆర్‌ఎస్ కలసి మత విద్వషాలు రెచ్చగోడుతున్నాయని…