Koppula Eshwar: కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దేశంలో 40 కోట్లకు పైగా దళితులు, గిరిజనులున్నారు. 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులకు ద్రోహం చేసిందన్నారు.
T Congress: తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (డబ్ల్యూసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది.
Jagadish Reddy: నల్లగొండలో 12 స్థానాలు గెలిచి కేసీఆర్ చేతిలో పెడతామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు కకావికలం అయ్యాయని అన్నారు.
Kishan Reddy: కాంగ్రెస్ కు ఓటు వేసిన BRS కి వేసినట్టే అని, ఈ రెండు పార్టీ లకి ఓటు వేస్తే మజ్లిస్ కు వేసినట్టేనని.. స్టీరింగ్ మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉందని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR: ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్ అని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. బెంగుళూర్ ని వెనక్కి నెట్టి ఐటీలో ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao: అది నోరా.. మొరా.. మీకు మొక్కాలి అంటూ రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్ధిపేట నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటించారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో రైతులకు స్పింక్లర్లను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేసారు.
తెలంగాణ జన గర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జన గర్జన సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలనే సంకల్పంతో ప్రభుత్వ అడ్డంకులు తొలగించి మరీ సభకు వచ్చానన్నారు.
Telangana Congress: టీ కాంగ్రెస్ మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. యువత ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఈ యాత్ర రేపటి నుంచి (ఈ నెల 5) నుంచి అంటే ప్రారంభం కానుంది.