Harish Rao: అది నోరా మొరా.. రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: అది నోరా.. మొరా.. మీకు మొక్కాలి అంటూ రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సిద్ధిపేట నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటించారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో రైతులకు స్పింక్లర్లను మంత్రి హరీశ్ రావు పంపిణీ చేసారు. అనంతరం మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారని ప్రశ్నించారు. రైతుల భూములకు, అటవీశాఖ 10 వేల కోట్లు ఇచ్చినామని తెలిపారు. కాళేశ్వరంతో ఏంపని కాలేదు అన్ని బట్ట కాల్చి మీద వేస్తున్నారు? అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం పూర్తి కాకపోతే ఇంత పంట ఎలా పండింది? అని ప్రశ్నించారు. అది నోరా లేక మొరా మీకు మొక్కలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాయక సాగర్ లో ముంచి బయటికి తీస్తే నీళ్లు వచ్చాయా లేదా తెలుస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క చెరువు కూడా మరమ్మతు చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తే మాకు కాళేశ్వరం రాకపోవు.. పంటలు పొండకపోవు అంటూ అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టింది 80 వేల కోట్లు లక్ష కోట్లు ఎక్కడివి రాహుల్ గాంధీ? అంటూ ప్రశ్నించారు.
Read also: Balagam Movie: ‘బలగం’కు మరో అరుదైన రికార్డు.. ఏకంగా 100 ఇంటర్నేషనల్ అవార్డులు
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
అంతకు ముందు కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి హరీష్‌రావు దర్శించుకుని మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంనతరం రూ.12 కోట్ల వ్యయంతో క్యూలైన్ల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారు. కాగా.. మల్లన్న సాగర్ నీటితోనే సీఎం కేసీఆర్ స్వామివారికి అభిషేకం చేశారని మంత్రి అన్నారు. ఇక.. జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్ నిర్మాణ పనులను వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా.. ఆలయానికి సంబంధించిన వంద గదుల సత్రం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక గుట్టపై దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థం గదులను నిర్మిస్తున్నామని, కొమురవెల్లి దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతోందని మంత్రి తెలిపారు. కాగా.. గతంలో ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఉండేవని కానీ, ప్రస్తుతం ప్రతీ యేటా దాదాపు రూ.18 కోట్ల ఆదాయం వస్తోందని తెలపారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభీక్షంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.
MLA Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్ట్.. కారణం ఇదే..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!