దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా కరోనా బారిన పడ్డారు. ఆయనలో కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు కనిపించడంతో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని దక్షిణాఫ్రికా ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం సిరిల్ రామఫోసా కేప్‌టౌన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగు చూసిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు కరోనా బారిన పడటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. సిరిల్‌కు సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అని అనుమానపడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం…