సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులు రష్యాకి చేరుకున్నారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న కోవడంతో తన కుటుంబంతోపాటు అధ్యక్షుడు రష్యాలోని మాస్కోకి చేరుకున్నారు."అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో రష్యా ఆశ్రయం కల్పించింది" అని స్థానిక వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.
Bashar al-Assad: తిరుగుబాటుతో సిరియా రెబల్స్ హస్తగతమైంది. ఇప్పటికే ఇస్లామిక్ గ్రూప్ హయరత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌ని ఆక్రమించుకున్నారు. ఇప్పటికే కీలక నగరాలైన అలెప్పో, హోమ్స్ వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో 24 ఏళ్లుగా సిరియాను పాలిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ పాలనకు తెరపడింది. 15 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగిసింది.
Bashar al-Assad: సిరియాలో గత 15 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడింది. ఇస్లామిక్ గ్రూప్ హయతర్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని రెబల్స్ రాజధాని డమాస్కస్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కీలక నగరాలైన అలెప్పో, హోమ్ వంటి నగరాలను, పట్టణాలను కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, రెబల్స్ ధాటికి తట్టుకోలేక రష్యన్, సిరియన్ బలగాలు పారిపోతున్నాయి.