సిరియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తాము సునిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఆ దేశ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అక్కడి అన్ని పార్టీలు సమష్టిగా కృషి చేయాలన్నారు.
ఇస్లామిక్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు గ్రూపుల సంకీర్ణం సిరియా రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో ఈ పశ్చిమాసియా దేశంలో 24 ఏళ్ల బషర్ అల్ అసద్ పాలనకు తెరపడింది. అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయారు! నియంతృత్వానికి వ్యతిరేకంగా 2008లో ట్యునీషియాలో మొదలైన అరబ్ స్ప్రింగ్ మూడేళ్ల తర్వాత 2011లో సిరియాకు చేరుకుంది.