Sweet Corn for Diabetics: డయాబెటిస్ తో బాధపడే వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న దానిపై విభిన్న రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా కొన్ని ఆహారాలు డయాబెటిస్ స్ధాయిలను పెంచుతుండగా, మరికొన్ని ఆహారాలు డయాబెటిస్ స్థాయిలను నియంత్రిస్తున్నాయని నిపుణులు పలు అధ్యయనాల ద్వారా నిర్ధారించారు. షుగర్ వ్యాధి గ్రస్తులు స్వీట్ కార్న్ తినే విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. తీపి మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉండటంతోపాటు, పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.