టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అతిథిగా విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, ప్రధానమంత్రి మోదీకి శాలువా కప్పి, దేవుడి చిత్రపటాన్ని బహూకరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార మహోత్సవం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో జూన్ 12న ఉదయం 11:27 గంటలకు జరగనుంది. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. మూడు ప్రత్యేక గ్యాలరీలతో సహా వేదిక చుట్టుపక్కల 65 ఎకరాల్లో పార్కింగ్, భారీ వర్షాలకు రెయిన్ ప్రూఫ్ షెడ్లు, ఎల్‌ఈడీ తెరలు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇంత సమాచారం కొరకు…