CM Chandrababu: స్వచ్చాంధ్ర, స్వచ్ దివాన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోగా.. ఈ నెలలో సోర్స్ రీ సోర్స్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోవాలన్నారు. మన మూలాలు - మన బలాలు తెలుసుకునేలా.. రాష్ట్రంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలనే దానిపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు.