Shocking : చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో, ఇది హత్య, ఆత్మహత్యనా లేక డ్రగ్స్ ఓవర్‌డోసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకులను పోలీసులు జహంగీర్, ఇర్ఫాన్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మరణాలు సహజంగా సంభవించి ఉండకపోవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో లోపల కీలక ఆధారాలు…
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో సహజీవనం చేస్తున్న జంట దారుణానికి పాల్పడింది. తమ ఇద్దరు నవజాత శిశువులను పుట్టిన వెంటనే పూడ్చిపెట్టింది. సంవత్సరాల తరువాత వారి అవశేషాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి లొంగిపోయారు. 25 ఏళ్ల భవిన్ పుతుక్కాడ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఇద్దరు నవజాత శిశువుల అవశేషాలను పోలీసులకు అప్పగించి తన నేరాన్ని అంగీకరించాడు.తాను, తన లివ్-ఇన్ పార్టనర్ అనిషా (22) పిల్లలు పుట్టిన వెంటనే వారిని పూడ్చిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.…
వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ విచారణ చేపట్టనుంది. అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులను సిట్ డీఎస్పీ విచారించనుంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు.
ఏపీలో జంగారెడ్డి గూడెం ఘటన అటు విపక్షాలు, అధికార పక్షం మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషనుకు ఫిర్యాదు చేశామన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజనాథ్. 30 మంది మృతికి గల కారణాలు బయటకురావాలన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్ మంత్రి జంగారెడ్డి గూడెం ఎందుకు సందర్శించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేస్తాం అన్నారు. సీఎం జగన్ ప్యాలెస్సులో కూర్చుంటే పాలన సాగదు. నాటుసారా…