ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఏపీలో రెవిన్యూ అధికారుల అవినీతి జాడలు వెలుగులోకి వస్తున్నాయి. పొదలకూరు పూర్వ తహసీల్దారు స్వాతి అవినీతి పై రెగ్యులర్ విచారణకి ఆదేశించారు ఏసీబీ డైరెక్టర్ జనరల్. ట్రైనీ తహసీల్దారు గా వచ్చి కోట్లాది రూపాయల అవినీతి ,అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు విచారణాధికారులు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన స్వాతి అక్రమాలను విచారించి, అవి నిజమేనని నిగ్గు తేలటంతో ఇప్పటికే ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏసీబీ రెగ్యులర్ విచారణలో మరిన్ని మైండ్ బ్లాక్ అయ్యే అంశాలు బయటకు వస్తున్నాయని తెలుస్తోంది. ఆమె హయాంలో జరిగిన వివిధ భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాల్సి వుంది. మరిన్ని విభ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందంటున్నారు మండల వాసులు.