నవతరం కథానాయకుల్లో సుశాంత్ ఇంకా తగిన గుర్తింపు కోసం కృషి చేస్తూనే ఉన్నాడు. కాళిదాస్తో మొదలైన సుశాంత్ నటనాప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సినీజనం కోరుకొనే బిగ్ హిట్ ఆయన ఖాతాలో ఇంకా చేరలేదనే చెప్పాలి. అయితే నటునిగా మాత్రం ఇప్పటి దాకా నటించిన చిత్రాల ద్వారా మంచి మార్కులే సంపాదించాడు సుశాంత్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల...వైకుంఠపురములో సుశాంత్ గెటప్ బాగుందని అతను అలా కంటిన్యూ అయిపోతే మరిన్ని మంచిపాత్రలు దరి చేరుతాయని సినీజనం అంటున్నారు. ప్రస్తుతం…