దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఓటమిపై భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని చెప్పాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, బ్యాటింగ్‌లో వైఫల్యమే తమ ఓటమిని శాసించిందన్నాడు. తాను, శుభ్‌మన్ గిల్ బాధ్యత తీసుకుని నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని, బౌలింగ్‌లో ప్లాన్ బీ కూడా లేదని సూర్య చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన…