ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఇవాళ ఏర్పడబోయే సూర్య గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి 09:12 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 9, 2024న తెల్లవారుజామున 2:22 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. ఉత్తర అమెరికాలోని ఎంచుకున్న ప్రాంతాలు సంపూర్ణ గ్రహణాన్ని ఎదుర్కొంటాయి.