ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో తొమ్మిది మంది పేరుమోసిన నక్సలైట్లు శనివారం లొంగిపోయారు. వీరంతా భద్రతా బలగాలపై అనేక దాడులకు పాల్పడ్డారు. ఈ నక్సలైట్లకు ఒక్కొక్కరికి రూ.25 వేలు ఇచ్చి ప్రభుత్వ విధానం ప్రకారం.. పునరావాసం కల్పిస్తారు. గతేడాది బస్తర్ ప్రాంతంలో 792 మంది నక్సలైట్లు లొంగిపోయారు. సుక్మాతో సహా ఏడు జిల్లాలు ఈ ప్రాంతంలో వస్తాయి.