రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ అనుకోని ఫలితాన్ని అందించలేకపోయింది. దీనికి ముందు వచ్చిన ‘సాహో’ సైతం పాక్షిక విజయాన్నే అందుకుంది. దాంతో ప్రభాస్ మానసిక ప్రశాంతత కోసం స్పెయిన్ కు వెళ్ళాడనే వార్తలు రెండు మూడు వారాల క్రితం వచ్చాయి. అయితే అక్కడ ప్రభాస్ తన మోకాలికి చిన్నపాటి ఆపరేషన్ చేయించుకున్నాడనీ కొన్ని రూమర్స్ వెలువడ్డాయి. కానీ ప్రభాస్ సన్నిహితులు ఎవరూ దీనిపై పెదవి విప్పలేదు. ఇదిలా ఉండగా, ‘రాధేశ్యామ్’ విడుదల…