టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లు, వన్డేల్లో సత్తా చాటాడని.. తర్వాత టెస్టుల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.
Suresh Raina: టీ20 ప్రపంచకప్‌లో ఆరంభ మ్యాచ్‌లు కాక రేపుతున్నాయి. శ్రీలంకపై నమీబియా, వెస్టిండీస్‌పై స్కాట్లాండ్ గెలిచి ఆయా జట్లకు షాకిచ్చాయి. ఇప్పుడు టోర్నీలో ముందడుగు వేయాలంటే శ్రీలంక, వెస్టిండీస్ గొప్పగా పోరాడాల్సి ఉంది. మరోవైపు ప్రాక్టీస్ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో అదరగొట్టిన టీమిండియా అసలు టోర్నీలో ఎలా ఆడుతుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్‌లో భాగంగా ఈనెల 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా ఆడాలి. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ సురేష్ రైనా…
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఊహించని షాక్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన పోస్టులను డిలీట్ చేశాడు. దీంతో.. సీఎస్కేకి జడేజా గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు మరింత బలపడ్డాయి. నిజానికి.. చెన్నై జట్టుకి డెడికేటెడ్‌గా ఉన్న ఆటగాళ్లలో జడేజా ఒకడు. అతడు అత్యంత కీలకమైన ప్లేయర్ కూడా! ఒంటిచేత్తోనే ఆ జట్టుని ఎన్నోసార్లు ముందుకు నడిపించిన సందర్భాలున్నాయి. అలాంటి జడేనా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.…
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈరోజు 41వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు సహచర ఆటగాళ్లు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ‘‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత జట్టుకి నువ్వు అందించిన ఎనలేని సేవలకు ధన్యవాదాలు. నువ్వు నాకు పెద్దన్నలా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం ఎప్పుడూ అలాగే ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్’’ అంటూ కోహ్లీ ట్వీట్…
కేవలం బ్యాట్‌తోనో, బంతితోనో కాదు.. అప్పుడప్పుడు క్రికెటర్లు కొన్ని అనూహ్యమైన రికార్డులు కూడా సృష్టిస్తుంటారు. ఇప్పుడు దినేశ్ కార్తీక్ ఖాతాలోనూ అలాంటి అరుదైన రికార్డే నమోదైంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో బెస్ట్ ఫినిషర్‌గా అవతారమెత్తి భారత జట్టులోకి అడుగుపెట్టిన ఈ వెటరన్ వికెట్ కీపర్.. తన అంతర్జాతీయ కెరీర్‌లో 10 మంది కెప్టెన్ల కింద ఆడి రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంతవరకు ఏ ఒక్క ఆటగాడు ఇంతమంది కెప్టెన్ల కింద ఆడిన దాఖలాలు లేవు.…
ఐపీఎల్లో సురేష్ రైనాకు అద్భుతమైన రికార్డు ఉంది. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అతడు గుర్తుండిపోయేలా ప్రదర్శనలు చేశాడు. అయినా ఈ ఏడాది అతడు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘స్పోర్ట్స్ ఐకాన్’ అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కోసం 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీపడగా చివరకు సురేష్ రైనాను వరించింది. ఈ అవార్డు కోసం…
ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనాకు ఊరట లభించనుంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ దూరమయ్యాడు. అతడిని వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు దక్కించుకుంది. ఇప్పుడు అతడు దూరం కావడంతో మరో ఆటగాడితో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు క్రికెట్ విశ్లేషకులు ఓ సలహా ఇస్తున్నారు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్న సురేష్ రైనాను…
ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గత 14 ఏళ్లుగా రైనా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఆడి ఎన్నో విజయాలను ఒంటిచేత్తో అందించాడు. ఈ నేపథ్యంలో రైనాను తీసుకోకపోవడంపై సీఎస్కే అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులతో తమ బాధను వెళ్లగక్కుతున్నారు. కరోనా కారణంగా 2020 సీజన్‌లో రైనా ఆడకపోయినా 2021 సీజన్‌లో అంచనాల మేరకు రాణించలేకపోయాడు. అయితే ఒక సీజన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని వేలంలో కొనుగోలు…