Sachin Tendulkar Lofted Shot Video In Road Safety Series Going Viral: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేత బ్యాట్ పట్టుకొని అలా మైదానంలోకి దిగితేనే గూస్‌బంప్స్ వచ్చేస్తాయి. మైదానమంతా ‘సచిన్ సచిన్’ అనే నినాదాలతో హోరెత్తుతుంది. కేవలం మైదానంలోకి దిగితేనే ఇంత హంగామా ఉంటే, ఇక తన ట్రేడ్ మార్క్ షాట్స్ అలరిస్తే..? దద్దరిల్లిపోవాల్సిందే! ఇప్పుడు అలాంటి సందర్భమే వచ్చింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ కోసం చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన సచిన్, తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అభిమానుల్ని అలరించాడు. శనివారం కాన్పూర్ వేదికగా ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. మఖాయ ఎంటిని బౌలింగ్‌లో సచిన్ అరుదైన లాఫ్టెడ్ షాట్‌తో తన క్లాస్ చూపించాడు. ఆ షాట్ కొట్టినప్పుడు స్టేడియం మొత్తం దద్దరిల్లింది. నిజానికి.. ఓపెనర్‌గా దిగిన సచిన్, క్రీజులో నిలబడింది కొద్దిసేపు మాత్రమే! ఆయన ఓవరాల్‌గా 16 పరుగులే చేశాడు. అయితే, ఉన్న ఆ కాసేపు తన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అలరించాడు. ఆ లాఫ్టెడ్ షాట్‌తో అభిమానుల కేరింతలతో స్టేడియం మార్మోగిపోయింది. ఆయన క్రీజులో ఉన్నంతసేపు.. ‘సచిన్, సచిన్’ అంటూ ఫ్యాన్స్ సందడి చేశారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బిన్నీ ఊచకోత కోశాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనితో పాటు సురేశ్ రైనా(33), యూసఫ్ పఠాన్(35) కూడా రాణించారు. ఇక 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో జాంటీ రోడ్స్ ఒక్కడే 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రాహుల్ శర్మ మూడు వికెట్లు తీయగా.. మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా చెరో రెండు వికెట్లు తీశారు.
Sachin Tendulkar in action#sachin #SachinTendulkar #LegendsLeagueCricket #IndiaLegends #RoadSafetyWorldSeries2022 @mohsinaliisb pic.twitter.com/CimxmF7Rr9
— abhijeet Gautam (@gautamabhijeet1) September 10, 2022