Suresh Raina: బాంబ్ పేల్చిన రైనా.. ఐపీఎల్‌కు గుడ్ బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suresh Raina Announced Retirement From IPL: క్రికెటర్ సురేశ్ రైనా తాజాగా బాంబ్ పేల్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు గుడ్ బై చెప్పేశాడు. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రైనా వైదొలిగాడు. ఇప్పుడు ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించాడు. విదేశాలకు చెందిన ఫ్రాంచైజీల తరఫున ఆడటం కోసమే రైనా ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఓవర్సీస్ టీ20 లీగ్‌లో పాల్గొనాలంటే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడతను ఆ పనే చేశాడు.
‘‘ఇన్నేళ్లపాటు ఈ దేశం, నా రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు సేవలు అందించినందుకు గర్వంగా భావిస్తున్నా. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన బీసీసీఐ, యూపీసీఏ, చెన్నై టీమ్, రాజీవ్ శుక్లా, నా అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా’’ అంటూ రైనా తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. రైనా ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పడం వెనుక మరో కారణం ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. ఐపీఎల్ టాప్ స్కోరర్లలో ఐదో స్థానంలో ఉన్న రైనా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో సుదీర్ఘ ప్రయాణం చేశాడు. ఆ జట్టు విజయాల్లో చాలాసార్లు కీలక పాత్ర పోషించాడు. కొన్నిసార్లు ఒంటిచేత్తోనే ఆ జట్టుని నడిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి రైనా.. 2022 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. చెన్నై అతడ్ని పట్టించుకోలేదు. ఇతర ఫ్రాంచైజీలు సైతం అతనిపై ఆసక్తి కనబరచలేదు. అతడు అన్‌సోల్డ్‌గానే మిగిలిపోయాడు. అది రైనాని నొప్పించింది. బహుశా ఆ కారణం చేతనే అతను ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పి ఉండొచ్చని క్రీడాభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపై దేశవాళీ లీగ్స్‌లో రైనాని చూడలేమని అతని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఓవర్సీస్ లీగ్స్‌లో మనం అతని ఆటని చూడొచ్చు.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
మరో రెండు, మూడేళ్లు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని రైనా తెలిపాడు. అయితే.. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ దేశవాళీ జట్టులో ఎంతో మంది మంచి ఆటగాళ్లున్నారని, తాను ఇప్పటికే యూపీ క్రికెట్ సంఘం నుంచి ఎన్ఓసీ తీసుకున్నానని చెప్పాడు. తన నిర్ణయం గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా, రాజీవ్ శుక్లాలకు సమాచారం ఇచ్చానన్నాడు. ప్రపంచంలోని వివిధ లీగ్‌ల్లో ఆడాలనుందని, సెప్టెంబర్ 10న ప్రారంభమయ్యే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడబోతున్నానని స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంక, యూఏఈ దేశాలకు చెందిన ఫ్రాంచైజీలు కూడా తనని సంప్రదించాయని, క్లియరెన్స్ వచ్చాక అందరికీ సమాచారం ఇస్తానన్నాడు. కాగా.. రైనా టీమిండియా తరఫున 266 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 7988 పరుగులు నమోదు చేశాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?