మొన్నటి వరకు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ బజ్ కొనసాగింది. ఇక ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెడీ అవుతోంది. ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న జరుగుతుంది. IPL 2025 ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5…
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలు ముస్సోరీలో జరుగుతున్నాయి. బుధవారం, గురువారం రెండ్రోజులుగా ఐటీసీ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సతీసమేతంగా కలిసి వచ్చాడు. ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Champions Trophy 2025 : ‘‘ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు విజయం సాధిస్తుందని 22 మంది పండితులు అంచనా వేశారు. ఈ 22 మంది పండిట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నియమించింది.
టీ20ల్లో అదరగొడుతున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో అరంగేట్రం చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్‌కు అవకాశం దక్కింది. తన 10 ఓవర్ల స్పెల్‌లో 54 పరుగులు ఇచ్చి.. ఓ వికెట్ తీశాడు. టాప్ బ్యాటర్లను సైతం ఇబ్బందిపెడుతున్న వరుణ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ అవకాశం దక్కనుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు. ఎంతో అనుభవం కలిగిన…
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం సమీపిస్తోంది. నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. మెగా వేలానికి 1574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. 574 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇండియన్ స్టార్స్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంకు సమయం ఆసన్నమైన…
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే... కాగా.. గత నెలలోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి బయటికొస్తున్నట్లు సూచన ఇచ్చారు. ఈ క్రమంలో.. తాను వేలానికి వెళితే ఎంత మొత్తం వస్తుందని అభిమానులను అడిగాడు పంత్.
భారత మాజీ బ్యాటర్ సురేష్ రైనా 2020 ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా.. తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని నిరూపించాడు. అమెరికా వేదికగా నేషనల్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్న సిక్స్టీ స్ట్రైక్స్ టోర్నమెంట్‌లో రైనా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. శనివారం లాస్ ఏంజిల్స్ వేవ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూయార్క్ లయన్స్ తరఫున ఆడుతున్న మిస్టర్ ఐపీఎల్ 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. 37 ఏళ్ల సురేశ్ రైనా…
Jonty Rhodes Says Ravindra Jadeja is Best Fielder in the World: భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు తాను పెద్ద అభిమానిని అని ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరొందిన జాంటీ రోడ్స్ తెలిపారు. రైనా క్రికెట్ ఆడిన రోజులను తాను ఎంతో ఆస్వాదించానన్నారు. రవీంద్ర జడేజా మైదానంలో ఎక్కడైనా ఫీల్డింగ్ చేయగలడని, జడ్డూ ‘కంప్లీట్ ఆల్‌రౌండ్ ఫీల్డర్’ అని పేర్కొన్నాడు. మంచి ఫీల్డర్‌గా మారడానికి చేతులతో సంబంధం లేదని, కాళ్లకు సంబంధించినది జాంటీ…
Harbhajan Singh apologizes to India Para Athletes: భారతదేశంలోని దివ్యాంగులకు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. ఎవరి మనోభావాలను కించపర్చడం తన ఉద్దేశం కాదని, తెలియక జరిగిన తప్పుకు క్షమించాలని కోరాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 టోర్నీ ఆడిన అనంతరం తమ నొప్పుల బాధను తెలియజేసేందుకే ఆ వీడియో చేశాం అని, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండని కోరాడు. డబ్ల్యూసీఎల్ 2024 టైటిల్‌ను భారత్ గెలిచిన…
ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన వీడియోలో వికలాంగులను ఎగతాళి చేసినందుకు మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, గురుకీరత్ మాన్‌లపై ఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.