Suresh Gopi: మలయాళ నటుడు సురేష్ గోపి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. ఎక్కువ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇంకా చెప్పాలంటే.. విక్రమ్ నటించిన ఐ మూవీలో విలన్ గా నటించింది సురేష్ గోపినే.