Surender Reddy Birthday: అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘ఏజెంట్’ ట్రైలర్ చూసిన వారికి అందులోని యాక్షన్ పార్ట్ నచ్చి ఉంటుంది. అది చూడగానే డైరెక్టర్ ఎవరా అని చూస్తే కనిపించే పేరు – సురేందర్ రెడ్డి. అయితే ‘సరే’… సురేందర్ రెడ్డి సినిమా అంటే ఆ మాత్రం యాక్షన్ ఉండి తీరుతుందని సగటు ప్రేక్షకుడు ఇట్టే నిర్ణయించేసుకుంటాడు. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలో యాక్షన్ లోనూ…