బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి, మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న సురేఖ సిక్రీ కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. ముంబైలో ఉంటున్న సురేఖ శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. 2018 నుంచి పక్షవాతంతో బాధపడుతున్న ఆమెకు 2020లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇలా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు నేడు గుండెపోటు వచ్చింది. సురేఖ సిక్రీ ప్రసిద్ధ టీవీ సీరియల్ “బాలికా వధు”తో దేశవ్యాప్తంగా కీర్తి పొందారు. ఏ సీరియల్ తెలుగులో “చిన్నారి పెళ్ళి కూతురు”…