“చిన్నారి పెళ్లి కూతురు” బామ్మ ఇకలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి, మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న సురేఖ సిక్రీ కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. ముంబైలో ఉంటున్న సురేఖ శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. 2018 నుంచి పక్షవాతంతో బాధపడుతున్న ఆమెకు 2020లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇలా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు నేడు గుండెపోటు వచ్చింది. సురేఖ సిక్రీ ప్రసిద్ధ టీవీ సీరియల్ “బాలికా వధు”తో దేశవ్యాప్తంగా కీర్తి పొందారు. ఏ సీరియల్ తెలుగులో “చిన్నారి పెళ్ళి కూతురు” పేరుతో విడుదలైంది. ఈ సీరియల్ లో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు కూడా సురేఖకు అభిమానులుగా మారిపోయారు.
Read Also : ఆకట్టుకుంటున్న “మాస్ట్రో” ఫస్ట్ సింగిల్
Also Read
సురేఖ సిక్రీ 1971లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్‌ఎస్‌డి) నుండి పట్టభద్రురాలైంది. 1978 పొలిటికల్ డ్రామా చిత్రం “కిస్సా కుర్సి కా”తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కిస్సా కుర్సీ కా, తమస్, సలీం లాంగ్డే పె మాట్ రో, పరినాటి, మమ్మో, నసీమ్, సర్దారీ బేగం, సర్ఫరోష్, జుబీడా, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, ఘోస్ట్ స్టోరీస్, మరియు బధాయ్ హో వంటి చిత్రాల్లో ఆమె నటించారు. తమస్ (1988), మమ్మో (1995), బధాయ్ హో (2018) చిత్రాలకు జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే సురేఖ సిక్రీ, హేమంత్ రెగెను వివాహం చేసుకున్నారు. వారికి రాహుల్ సిక్రీ అనే కుమారుడు ఉన్నారు. ఆమె మరణించిన వార్త తెలిసిన పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!