Maternity Leave: ప్రసూతి సెలవు అనేది మహిళల ప్రసూతి ప్రయోజనాల్లో అంతర్భాగమని, మహిళల పునరుత్పత్తి హక్కుల్లో కీలకమైన భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఏ సంస్థ కూడా ఒక మహిళ ప్రసూతి సెలవుల హక్కుల్ని హరించలేవని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.