ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు లా క్లర్క్–కమ్–రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 80 వేల జీతం అందుకోవచ్చు. దేశ అత్యున్నత న్యాయ స్థానంలో…