Justice Surya Kant: భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నెలల తర్వాత, ఆయన వారసుడిని నియమించే ప్రక్రియ ప్రారంభమైంది. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ గవాయ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 23తో ముగుస్తోంది. రేపటిలోగా తన వారసుడిని సిఫారసు చేయమని కోరుతూ ప్రభుత్వం గవాయ్‌కి లేఖ రాసినట్లు సమాచారం. గవాయ్ నవంబర్ 23, 2025న పదవీ…
న్యాయవాదుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన మరుసటి రోజే శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ ప్రమాణ స్వీకారం చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం ఇద్దరు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది.
ఇక నుంచి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి ఢిల్లీలో ఉచిత బంగ్లా, భద్రత, డ్రైవర్‌ను కేటాయించే విధంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులకు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులకు కూడా ఈ సౌకర్యం వర్తించనుంది.
నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ (నల్సా) ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన ప్రచార కార్యక్రమానికి సుప్రీంకోర్డు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు, హైకోర్టులు అత్యంత స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా తీర్పులు సులభంగా అర్థమయ్యేలా, స్పష్టమైన భాషలో ఉండాలని, న్యాయమూర్తులు సాధరణ భాషలో తీర్పు రాయాలని ఆయన అన్నారు. కోర్టుల నిర్ణయాలకు సామాజికంగా ఎక్కువ ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అట్టడుగు స్థాయిలో…
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడు గ్రామానికి చెందిన వైష్ణవి అనే చిన్నారి తమ ఊరికి బస్సు సౌకర్యం లేదని, స్కూల్ వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది. దీంతో భారత సర్వోన్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వైష్ణవి రాసిన లేఖకు స్పందించారు. వెంటనే చిదేడు గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని టీఎస్‌ఆర్టీసీని ఆదేశించారు. ఎన్వీ రమణ ఆదేశాల మేరకు…
సుప్రీం కోర్టులో తొలిసారి ఓ అరుదైన ఘటన జరిగింది.. కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ… సుప్రీంకోర్టు కొత్త జడ్జీలతో ప్రమాణం చేయించారు. కాగా, సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడం ఇదే తొలిసారి. మరోవైపు.. కోవిడ్ నేపథ్యంలో ప్రమాణస్వీకార వేదికను ఒకటో కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియంలోకి మార్చారు.. ఇక, జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష…
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9 మంది నేడు 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీం కోర్టు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 9 మంది ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు, సంప్రదాయంగా కోర్టు హాల్ 1 లో కొత్తగా నియామకమైన న్యాయమూర్తుల తో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయుస్తారు. అయుతే, ఇప్పుడు కోర్టు హాల్ 1 లో కాకుండా, సుప్రీం కోర్టు అనుబంధ భవన సముదాయంలో ఉన్న ఆడిటోరియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని…
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం.. కేంద్ర ప్రభుత్వానికి న్యాయమూర్తుకు సంబంధించిన సిఫార్సులు చేసింది.. 9 మంది న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కొలీజియం.. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న భవిష్యత్తులో తొలి భారత సుప్రీం కోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. జస్టిస్ విక్రమ్ నాధ్ ( గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్…