Justice Surya Kant: భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నవంబర్ 24న ఆయన సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ స్థానంలో ఆయన అత్యున్నత న్యాయ పదవికి నియమితులయ్యారు. న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సూర్యకాంత్ నియామకాన్ని ధ్రువీకరించారు. “భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను నవంబర్ 24 నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి రాష్ట్రపతి…
సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి జరిగింది. బీఆర్.గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు. గవాయ్‌పై షూ విసిరాడు. దీంతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది.
భారత న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో నడవడం లేదని.. చట్టబద్ధమైన పాలనతోనే నిర్వహించబడుతుందని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గవాయ్ మారిషస్‌లో పర్యటిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 8 వారాల్లోగా వీధి కుక్కలు లేకుండా చేయాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఎవరైనా అడ్డుకుంటే కఠిన చర్యల తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కు ఘనంగా సన్మానం జరిగింది. ఢిల్లీ లలిత్ హోటల్‌లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీజేఐకి సన్మానం జరిగింది.
నీట్-యూజీపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇంతలో సీనియర్ న్యాయవాది చేసిన పని సీజేఐ డీవై చంద్రచూడ్‌కు కోపం తెప్పించింది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఇక శుక్రవారం తొలి విడత పోలింగ్ జరిగింది. ఆయా రాష్ట్రాల్లో భారీగానే పోలింగ్ నమోదైంది. ఇక ఏప్రిల్ 26న సెకండ్ విడత పోలింగ్ జరగనుంది.
నిబద్ధత, విశ్వాసంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి చేరవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వై.చంద్రచూడ్ అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ఎస్వీయూ న్యాయశాఖ 10వ వార్షికోత్సవ వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.