దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినా..అక్కడక్కడా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలంటున్నారు నిపుణులు. ఇదిలా వుంటే పిల్లల వ్యాక్సినేషన్ సురక్షితమేనని నిపుణులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తన కీలక తీర్పు వెల్లడించింది. నిపుణులు తమ అభిప్రాయం చెప్పాక తాము నిర్ణయాన్ని వెలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో పిల్లలకు కొవిడ్ టీకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. శాస్త్రీయ ఏకాభిప్రాయం, ప్రపంచ సాధికార సంస్థల సూచనలకు అనుగుణంగానే ఉన్నట్లు…
సుప్రీం కోర్టు బెంచ్ పెడితే భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వేతనాలు పెంచడానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్‌లు ఏర్పాటు చేయాలని, ఆర్టికల్ 130 ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయొచ్చని సూచించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేవలం నలుగురు (9 శాతం),…