గత ఆరేళ్లలో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు దాఖలు చేసిన కేసుల వివరాలను సుప్రీంకోర్టు బుధవారం (జనవరి 29) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019లో ఆమోదించిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని ఉల్లంఘించి, ట్రిపుల్ తలాక్ చెప్పి ఎంత మంది ముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులు ఇచ్చారో స్పష్టత ఇవ్వాలని కోరింది.
1995లో జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) ప్రభునాథ్ సింగ్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు తీర్పుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ లో ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. మూడు విషయాలను ఎక్కువ కాలం దాచలేము.. 'సూర్యుడు, చంద్రుడు, నిజం' అంటూ గౌతమ బుద్ధుడి కవితను సంధించారు.
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల వరుస మృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం(Supreem Court) ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒకదాని వెంట ఒకటి మృతి చెందుతుండటంతో.. దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతవారం రెండు చీతాలు చనిపోవడాన్ని ప్రస్తావించిన…
అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం సుప్రీంకోర్టులో 41 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అంతేకాకుండా నిపుణుల కమిటీ మరియు పిటిషనర్ల సిఫార్సులను రికార్డులో ఉంచింది. సెబీ కూడా సుప్రీంకోర్టు నుంచి 'తగిన ఉత్తర్వుల' కోసం చూస్తోంది.
త మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రకటనల కోసం చేసిన ఖర్చులకు లెక్కలు చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం కోరింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ, వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.