CJI NV Ramana: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం నాడు విశాఖలో పర్యటించారు. విశాఖ వచ్చిన ఎన్వీ రమణకు అంకోసా హాలులో రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి) శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణను రావిశాస్త్రి కుటుంబీకులు ఘనంగా సత్కరించారు. రావిశాస్త్రికి నివాళులు అర్పించిన అనంతరం శతజయంతి సభలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. రావిశాస్త్రి కవిత్వం ముందు తన…