తండ్రి కృష్ణ తన పేరు ముందు ‘సూపర్ స్టార్’ను విశేషణంగా మార్చుకున్నారు. ఇక తనయుడు మహేశ్ బాబు సైతం ‘సూపర్ స్టార్’గా అభిమానుల మదిలో నిలిచారు. బాలనటునిగానే భళా అనిపించారు మహేశ్. తండ్రి కృష్ణను నటశేఖరునిగా జనం మదిలో నిలిపిన ‘అల్లూరి సీతారామరాజు’ గెటప్ ను బాల్యంలోనే ధరించి పరవశింప చేశారు మహేశ్. ఇక చిత్రసీమలో యంగ్ హీరోగా అడుగు పెట్టిన తరువాత తండ్రి అడుగుజాడల్లోనే పయనిస్తూ ఫ్యాన్స్ ను మురిపించారు మహేశ్. తెలుగు చిత్రసీమకు కౌబోయ్…