Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి సూపర్ ఫోర్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “మేము ఉత్తమంగా ఏమి చేయగలమో దానిపై దృష్టి పెడుతున్నాం. గత రెండు మూడు మ్యాచ్‌లలో మేము అనుసరిస్తున్న మంచి అలవాట్లన్నింటినీ పాటించాలని…
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశ చివరి మ్యాచ్ లో భాగంగా.. కాసేపట్లో భారత్ - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీలంక-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన కీలకమైన సూపర్-4 మ్యాచ్ మరింత ఆలస్యం కానుంది. ఆసియా కప్ 2023లో భాగంగా.. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగాల్సి ఉండగా.. ఇంకా టాస్ కూడా వేయలేదు. అయితే ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే.. శ్రీలంక ఫైనల్ కు చేరుకుని నవంబర్ 17న ఇదే స్టేడియంలో భారత్‌తో తలపడనుంది.
నిన్న పాకిస్తాన్ తో మ్యాచ్ గెలిచి మంచి జోరు మీదున్న టీమిండియా.. శ్రీలంకతో ఆరంభంలో మంచి ప్రారంభాన్ని అందించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ అర్థసెంచరీ సాధించగా.. మరో ఓపెనర్ గిల్(19) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా కేవలం (3) పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆసియా కప్ లో భాగంగా సూపర్-4లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అనుకున్న సమయం కంటే గంటకు పైగా ఆలస్యంగా ప్రారంభమైంది. నిన్న 24.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రెండో రోజు అక్కడి నుంచే బ్యాటింగ్ మొదలెట్టింది. నిన్న మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిన టీమిండియా.. ఇవాళ కూడా దూకుడుగా ఆటను ప్రారంభించారు.
2023 ఆసియా కప్‌లో రేపు(ఆదివారం) భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 రౌండ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ ఆసక్తికర మ్యాచ్ కోసం పాకిస్థాన్ తన ప్లే ఎలెవన్‌ని ప్రకటించింది. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో పాకిస్థాన్ జట్టు భారత్‌తో తలపడనుంది. భారత్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్‌కు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది.
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కే రిజర్వ్ డే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే లీగ్ దశలో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
What happens if Asia Cup 2023 Super-4 Matches in Colombo are washed out: ఆసియా కప్ 2023లో గ్రూప్ దశ ముగిసి.. సూపర్-4 సాగుతోంది. సూపర్-4 తొలి మ్యాచ్ లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరగ్గా.. బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక సూపర్-4లో మిగిలిన 5 మ్యాచ్‌లు శ్రీలంకలోని కోలంబోలో జరగనున్నాయి. సూపర్-4లో భారత్, శ్రీలంక జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు మాత్రం రెండేసి మ్యాచ్‌లను ఆడుతాయి.…
ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యా్చ్ లో 7 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 194 పరుగుల టార్గెట్ ను పాకిస్తాన్ 39.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.
Asia Cup 2023 Super-4, Final Matches to stay in Colombo: కొలంబోలో భారీ వర్షాల కారణంగా ఆసియా కప్ 2023 ‘సూపర్-4’ మ్యాచ్‌లు, ఫైనల్ వేదికను మార్చే అవకాశం ఉందని జరిగిన చర్చకు తెర పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే.. సూపర్ 4 మ్యాచ్‌లు, ఫైనల్ యధాతథంగా కొలంబోలోనే జరుగనున్నాయి. కొలంబోలో వాతావరణం మెరుగయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. వేదికను మార్చకూడదని మంగళవారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించింది. భారీ వర్షాల కారణంగా సూపర్…