ఇదిలా ఉంటే, బీహార్‌లోని సున్నీ వక్ఫ్ బోర్డు ఒక గ్రామంలో చాలా కాలంగా నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సదరు భూమి వక్ఫ్ భూమిగా పేర్కొంటూ ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ వివాదాస్పద ప్రాంతంలో నివసించే వారిలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. ప్రస్తుతం ఈ సమస్య పాట్నా హైకోర్టు ముందు ఉంది, సున్నీ వక్ఫ్ బోర్డు వారి వాదనలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాధారాలను అందించడంలో విఫలమైంది.