Srisailam Dam: ఇటీవల వరదలతో పోటెత్తిన కృష్ణమ్మ శాంతించింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను మంగళవారం నాడు అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ నుంచి 1.21 లక్షల క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 21,725 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. అటు శ్రీశైలం కుడి, ఎడమ గట్ల జల విద్యుత్ కేంద్రాల నుంచి 64,243 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు అధికారులు…
రుతుపవనాల ప్రభావం కారణంగా తుంగభద్ర డ్యాంకి వరద నీరు ఉప్పొంగుతోంది. కర్ణాటకను వరుణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి ఇన్ ఫ్లో పెరిగింది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఆర్డీఎస్ ఆనకట్టకు 10,743 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 643 క్యూసెక్కులు, దిగువకు 10,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సుంకేసుల ఆనకట్టకు…