వెర్సటైల్ హీరో సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 17వ తేదీ ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సి. కళ్యాణ్ ప్రకటించారు. ఐశ్వర్యలక్ష్మీ నాయికగా నటించిన ‘గాడ్సే’లో నాజర్, షాయాజీ షిండే, కిశోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతంలో సత్యదేవ్ తో ‘బ్లఫ్ మాస్టర్’ మూవీని తెరకెక్కించిన గోపీ గణేశ్ ఇప్పుడీ ‘గాడ్సే’ను డైరెక్ట్ చేశాడు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడితో పోరాడే యువకుడి…
గతంలో ఎప్పుడూ టచ్ చేయని వైవిద్యభరితమైన కథాంశానికి, హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి ‘విక్కీ: ది రాక్ స్టార్’ అనే పేరుతో డిఫరెంట్ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సి. ఎస్ గంటా. వర్దిని నూతలపాటి సమర్పణలో ఈ చిత్రాన్ని లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ‘విక్కీ: ది రాక్ స్టార్’…
వాస్తవ సంఘటన ఆధారంగా, బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సి. ఎస్. గంటా తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్కి ది రాక్ స్టార్’. వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో 87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి (ఐ.ఎ.ఎఫ్.) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ బాధ్యతలు చేపట్టారు. పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్ కశ్యప్ ‘విక్కి ది రాక్ స్టార్’కు బాణీలు కడుతున్నారు. విక్రమ్, అమృత చౌదరి…
యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘గాడ్సే’ చిత్రం టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంది. తాజాగా ‘గాడ్సే’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్విట్టర్ లో ఈ టీజర్ లింక్ ను షేర్ చేస్తూ చిరు హీరో సత్యదేవ్, దర్శకుడు గోపి, సినిమా నిర్మాత సి కళ్యాణ్ లను అభినందించారు. టీజర్ విషయానికొస్తే… 1.18 నిమిషాల నిడివితో…