First Single: సాయికుమార్ యముడిగా ‘యమ డ్రామా’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Kumar: సోషియో ఫాంటసీ థ్రిల్లర్ మూవీస్ ట్రెండ్ తో నిమిత్తం లేకుండా ఎప్పుడొచ్చినా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటాయి. అలాగే యముడిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసుకుని రూపొందిన సినిమాలు సైతం ఎంతగానో అలరిస్తుంటాయి. ఇప్పుడు ఆ కోవలో ‘యమ డ్రామా’ చిత్రం తెరకెక్కింది. సాయికుమార్ యముడిగా నటించిన ఈ సినిమాలో యువచంద్ర, శివకుమార్, కౌటిల్య, సుదర్శన్ రెడ్డి హీరోలుగా, ప్రియాంక శర్మ (‘సవారి’ ఫేమ్), నేహాదేశ్ పాండే, హమీద ప్రధాన పాత్రలు పోషించారు. టి. హర్షచౌదరి దర్శకత్వంలో తోటకూర శివరామకృష్ణారావు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలోని “నిను చూసినాకనే…” అనే మొదటి పాటకు పాటను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె. ఎల్. దామోదర ప్రసాద్ విడుదల చేశారు. దీనికి కరుణాకర్ సాహిత్యం అందించగా, సునీల్ కశ్యప్ స్వర రచన చేశారు. ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, “ఈ చిత్ర బృందం సినిమా మొదలు పెట్టిన తర్వాత కరోనా విలయతాండవం చేసినప్పటికీ, కష్టాలన్నింటినీ అధిగమించి, సినిమాను పూర్తి చేసి, విడుదలకు సన్నాహాలు చేస్తుండటం అభినందనీయం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరింపజేస్తుందన్న నమ్మకం ఉంది” అని అన్నారు. మరో అతిథి డి.ఎస్.రావు మాట్లాడుతూ, “కొత్త డైరెక్టర్లు చిన్న సినిమాలతో పెద్ద విజయాలను సాధిస్తున్నారు. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. ఇది కూడా ఆ జాబితాలో చేరాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. మంచి వినోదం, భావోద్వేగాలను రంగరించి, ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించానని దర్శకుడు హర్ష చౌదరి తెలిపాడు. ఇదే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాత శివరామ కృష్ణారావు చెప్పారు.
Also Read
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Suriya - Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
- JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
- Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
తాజావార్తలు
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!